టాలీవుడ్

'ఆచార్య' నుంచి రేపు కీలక అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఆచార్య'.. ఇది చిరంజీవికి 152 వ చిత్రం కావడం విశేషం.

ఆచార్య  నుంచి రేపు కీలక అప్డేట్!
X

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఆచార్య'.. ఇది చిరంజీవికి 152 వ చిత్రం కావడం విశేషం. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోందని తెలుస్తోంది. ఈ సినిమాని నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ సిద్దా అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కీలక ప్రకటన రేపు రానుంది. రేపు ఉ.10 గంటలకు టీజర్ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని చిరంజీవి ట్వీట్ చేశాడు. దీనిపై కూడా ఓ మీమ్ కూడా విడుదల చేసారు.

ఈ మీమ్ చిరంజీవి, కొరటాల మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది . ఏమయ్యా శివ ఇప్పటి వరకు ఆచార్య సినిమాకి సంబంధించిన టీజర్ లేదు.. న్యూ ఇయర్‌కు వస్తుందనుకుంటే రాలేదు.. సంక్రాంతికి వస్తుందేమో అనుకుంటే అప్పుడు కూడా రాలేదు. నువ్వు చెప్తావా నన్ను లీక్ చేయమంటావా అంటూ చిరంజీవి కొరటాలతో అన్నట్టుగా మీమ్ క్రియేట్ చేశారు.

దీనికి కొరటాల శివ స్పందిస్తూ.. జనవరి 27 ఉదయం ఫిక్స్ సర్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేస్తాను సర్ అంటూ మాటిచ్చాడు. దీనితో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Next Story

RELATED STORIES