ఉప్పెన సినిమాలో బేబమ్మకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?

ఉప్పెన సినిమాలో బేబమ్మకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?
సినిమా చూసే ప్రేక్షకులకి ఎక్కువగా అందులోని నటీనటులు.. వారు చెప్పే సంబాషణలు మాత్రమే గుర్తుంటాయి. ఇందులో హీరోయిన్స్ వాయిస్‌‌‌‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.

సినిమా చూసే ప్రేక్షకులకి ఎక్కువగా అందులోని నటీనటులు.. వారు చెప్పే సంబాషణలు మాత్రమే గుర్తుంటాయి. ఇందులో హీరోయిన్స్ వాయిస్‌‌‌‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.. ఆ వాయిస్‌‌కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కోసారి ఆ వాయిస్ ఆ హీరోయిన్‌‌‌ది కాదని తెలిసిన నమ్మలేరు.. ఉదాహరణకి ఏ మాయ చేసావే సినిమాలో సమంత చెప్పిన డైలాగ్స్ ఎంత ఫేమస్ అయ్యయో అందరికీ తెలిసిందే.. ఆ హస్కీ వాయిస్‌‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఆ వాయిస్ సింగర్ చిన్మయిదని తెలిసాక షాక్ అయ్యారు.ఉప్పెన సినిమాలో బేబమ్మకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?

అయితే ఇటీవల వచ్చిన ఉప్పెన సినిమా పెద్ద సక్సెస్‌‌ని అందుకుంది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కృతిశెట్టికి మంచి పేరు వచ్చింది. సినిమాలో ఆమె నటనకి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే ఆమె నటనకి డబ్బింగ్ మరింత ప్లస్ అయిందని చెప్పాలి. కానీ ఆమెకి డబ్బింగ్ చెప్పింది ఎవరనేది మాత్రం చాలా మందికి తెలియదు.. ఈ బేబమ్మకి డబ్బింగ్ చెప్పింది డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత. విశాఖపట్నంకి చెందిన శ్వేత డబ్బింగ్ ఆర్టిస్ట్ కంటే ముందు రేడియో మిర్చిలో ఆర్జేగా పనిచేశారు.


ఆర్జేగా పనిచేస్తున్నప్పుడే సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ రావా సినిమాలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్‌‌‌కి డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. ఆ సినిమాకి మంచి పేరు రావడంతో ఆమెకి వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అందులో భాగంగానే... హలో, రణరంగం సినిమాలలో కళ్యాణి ప్రియదర్శన్‌‌కి డబ్బింగ్ చెప్పింది.

ఇక భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానికి, చిత్రలహరి సినిమాలో నివేత పేతురాజ్‌‌కి, ఒరేయ్ బుజ్జిగా సినిమాలో మాళవిక నాయర్‌‌కి, చెక్ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్‌‌కి, డబ్బింగ్ చెప్పారు. ఇక నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో ఫ్యామిలీ పార్టీ పాటలో కూడా కనిపించింది శ్వేత.

Tags

Read MoreRead Less
Next Story