వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. !

వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్ చిత్రం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్ చిత్రం... అయితే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్.. మార్చి 29న సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్... వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని.. దిల్ రాజు, బోణీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ రీఎంట్రీ మూవీ కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story