Vani Jayaram Demise: మూగబోయిన 'వాణి'

పద్మభూషణ్ పురస్కార గ్రహీత వాణీ జయరామ్ చెన్నైలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. 78ఏళ్ల వాణీ జయరామ్ గాయనిగా సుమారు 19 భాషల్లో 10వేలకు పైగా పాటలను ఆలపించారు. యావత్ సినీ పరిశ్రమకు గాయనిగా ఆమె అందించిన అపురూప సేవలకు గుర్తింపుగా 2023 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆమెకు దేశ మూడవ అత్యుత్తమ పురస్కారం అయిన ప్రద్మభూషణ్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాణీ జయరామ్ మరణం దేశవ్యాప్తంగా అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చెన్నైలోని నుంగామబక్కమ్ లోని ఆమె స్వగృహం వాణి తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 2018లో ఆమె భర్త జయరామ్ కన్నుమూశారు. తరతరాలుగా సంగీతాన్నే దైవంగా ఆరాధిస్తున్న సంప్రదాయ సంగీతకళాకారుల ఇంట వాణీ జన్మించారు. దురైస్వామి అయ్యంగర్, పద్మావతిల గారాల పట్టి అయిన వాణీ... 1971లో తొలిసారి ప్లే బ్యాక్ సింగర్ అయ్యారు. 19 భాషల్లో పాడిన ఆమె ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com