Vanitha Vijayakumar : 'సమాజం అన్నది అవాస్తవం సామ్' : వనిత విజయ్ కుమార్

Vanitha Vijayakumar : చైసామ్ విడిపోవడం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఎక్కడ ఏ నలుగురు కలిసిన దీనే గురించే టాపిక్.. అయితే వీరి విడాకులకి కారణం సమంతనే అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. సమంత పిల్లలు వద్దనుకుందని, ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ కూడా చేయించుకుంది అంటూ వీపరితంగా ట్రోల్ చేశారు.
వీటిపైన స్పందించిన సామ్... ఇప్పటికే విడాకుల బాధ నుంచి బయటకు రావడం లేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో వ్యక్తిగతంగా ఎటాక్ చేయడం సరికాదని వెల్లడించింది. ఈ క్రమంలో ఆమెకి రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ సైతం సామ్ కి అండగా నిలిచింది.
'సమాజం అన్నది అవాస్తవం సామ్. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితం చాలా విలువైంది. ఏం జరిగినా దాని వెనుక ఓ కారణం ఉండే ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్లు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com