Venkatesh: యంగ్ హీరో సినిమాలో వెంకటేశ్ కీ రోల్.. డిఫరెంట్ పాత్రలో..

Venkatesh: యంగ్ హీరో సినిమాలో వెంకటేశ్ కీ రోల్.. డిఫరెంట్ పాత్రలో..
Venkatesh: ఇటీవల వెంకటేశ్ ‘ఎఫ్ 3’ చిత్రంతో క్లీన్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు.

Venkatesh: ఈమధ్య సీనియర్ హీరోలు సైతం వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాల వైపు వెళ్లకుండా.. వారికి సూట్ అయ్యే డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నారు. ఆ ఫార్ములాతోనే టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుసగా హిట్లు కొడుతున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ కూడా అలాంటి ఓ డిఫరెంట్ పాత్రకే ఓకే చెప్పినట్టు సమాచారం.

ఇటీవల వెంకటేశ్ 'ఎఫ్ 3' చిత్రంతో క్లీన్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత తాను ఏ సినిమా చేస్తున్నారన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ యంగ్ హీరో సినిమాలో కీలక పాత్ర చేయడం కోసం వెంకటేశ్ ఒప్పుకున్నాడట. అది కూడా ఓ దేవుడి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అదే యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న 'ఓరి దేవుడా' సినిమా.

విశ్వక్ సేన్, మిథిలా పార్కర్ జంటగా నటిస్తున్న చిత్రమే 'ఓరి దేవుడా'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఓ మై కడవులే' చిత్రానికి ఇది రీమేక్. అయితే ఈ సినిమాలో కథను మలుపు తిప్పే దేవుడి పాత్ర ఉంటుంది. ఇప్పటికీ ఈ పాత్ర కోసం చాలా స్టార్ హీరోలు పేర్లు వినిపించగా.. ఇప్పుడు వెంకటేశ్ చివరిగా ఈ పాత్రను చేయడానికి ఒప్పుకున్నారట. అంతే కాకుండా దీనికి మూడు రోజుల కాల్‌షీట్స్ కూడా కేటాయించారని సమాచారం.



Tags

Read MoreRead Less
Next Story