17 March 2023 6:48 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Venky & Ajay another...

Venky & Ajay another Remake: మరో సినిమాను రీమేక్ చేేసేందుకు వెంకి - అజయ్ రెడీ

మరో మూవీపై కన్నేసిన వెంకి మామ, ఆజయ్ దేవగణ్; అయోతి సినిమా రైట్స్ కొనుగోలు..

Venky & Ajay another Remake: మరో సినిమాను రీమేక్ చేేసేందుకు వెంకి - అజయ్ రెడీ
X

మళయాళం దృశ్యం రీమేక్ లతో ఇటు తెలుగులోనూ, అటు బాలీవుడ్ లోనూ బాక్సాఫీస్ కు కలెక్షన్లు రాబట్టిన వెంకటేశ్, అజయ్ దేవగణ్ ఇప్పుడు మరో రీమేక్ పై కన్నేశారు. ఇటీవలే కోలీవుడ్ లో రిలీజ్ అయిన అయోతి అనే సినిమాను ఒకేసారి రీమేక్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. కోలీవుడ్ నటుడు శశికుమార్, తెలుగు నటి ప్రీతి అస్రానీ నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. త్వరలోనే ఈ సినిమాల ఇటు తెలుగులో మన వెంకి మామ, అటు హిందీలో అజయ్ దేవగణ్ తర్జమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు ఇరువురూ తమ తమ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే వెంకటేశ్ రానానాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మిక్స్ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు అజయ్ దేవగణ్ కార్తీ ఖైదీ సినిమా రీమేక్ లో నటించిన సంగతి తెలిసిందే. భోళా అనే టైటిల్ లో రీమేక్ అయిన ఖైదీలో హిందీ నేటివిటీకి తగ్గట్లు ఎన్నో మార్పులు చేశారు. ఇందులో భాగంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో టబు కనిపించబోతున్నారు.

Next Story