పవన్‌ కళ్యాణ్‌తో పనిచేయడం నా అదృష్టం.. ముందు వేరే టైటిల్ అనుకున్నాం: దర్శకుడు శ్రీరామ్ వేణు

పవన్‌ కళ్యాణ్‌తో పనిచేయడం నా అదృష్టం.. ముందు వేరే టైటిల్ అనుకున్నాం: దర్శకుడు శ్రీరామ్ వేణు
తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు 'పింక్' ని మలిచి వకీల్ సాబ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ తనకి స్పెషల్ అంటున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు.

పవన్ సినిమా అంటే ప్రేక్షకులకు ఇష్టం.. పవన్‌తో సినిమా చేయడం అంటే దర్శక నిర్మాతలకు ఇష్టం. పవన్ కళ్యాణ్‌లో ఏదో ఈజ్ ఉందంటూ హీరోయిన్లు కూడా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ముచ్చటపడుతుంటారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకు దూరమవుతాడేమోఅని అభిమానులు నిరుత్సాహ పడ్డారు. కానీ వకీల్‌సాబ్‌గా వస్తున్నాడని తెలిసి ఎగిరి గంతేసారు.. విడుదలైన ట్రైలర్‌కే బ్రహ్మరథం పట్టారు.

ఇక సినిమా రిలీజైతే ఓ రేంజ్‌లో పవన్ ఇమేజ్ మళ్లీ దూసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వకీల్ సాబ్‌ని డైరెక్ట్ చేసిన శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదంటున్నారు. ఇదే విషయంపై ముచ్చటిస్తూ ఆయన సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు.

రెండు సినిమాలు.. సిద్దార్థ్, శృతిహాసన్‌తో 'ఓ మై ఫ్రెండ్', నానీతో 'ఎంసిఎ' తీసినా సంతృప్తి చెందలేదు. బాలీవుడ్‌లో అమితాబ్, తాప్సీ నటించిన పింక్‌ సినిమాని అప్పటికే కొన్ని మార్పులు చేసి తమిళ్‌లో తీశారు. ఇక వేణు కూడా అదే సినిమాని తీసుకుని తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు 'పింక్' ని మలిచి వకీల్ సాబ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ తనకి స్పెషల్ అంటున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు.

మహిళా సాధికారికత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర కథ విన్న వెంటనే పవన్ ఓకే చేశారు. ఆయనతో సినిమా చేయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. ఎందుకంటే ఆయన అభిమానులకు దేవుడు. వ్యక్తిగతంగా పవన్ చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు.

ట్రైలర్‌లోనే సినిమా చూపించా..

సినిమా పోస్టర్లు, టీజర్ విడుదలైనప్పుడు చాలా మంది కామెంట్లు చేశారు. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చూసి నాకెంతో ఆనందంగా ఉంది.

చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వకీల్ సాబ్‌తో అదీ నా డైరెక్షన్‌లో వస్తున్నారని తెలిసి నెటిజన్స్ ఓ రేంజ్‌లో నన్ను ఆడుకున్నారు. ఇంకే డెరెక్టర్ దొరకలేదా.. ఈ కథ తప్ప వేరే ఏ కథ దొరకలేదా అని కామెంట్లు పెట్టారు. అన్నింటినీ తట్టుకుని వకీల్ సాబ్‌ వస్తోంది. ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరచదని భావిస్తున్నాను.

మొదట ఈ చిత్రానికి టైటిల్ 'మగువా లోకానికి తెలుసా నీ విలువ' అని అనుకున్నాం. ఆ తర్వాత 'లాయర్ సాబ్', చివరికి 'వకీల్ సాబ్' ఫిక్స్ చేశాం అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story