Venu Swamy : నేను అప్పుడే చెప్పాను... మళ్ళీ లైన్ లోకి వేణు స్వామి..!

Venu Swamy : నేను అప్పుడే చెప్పాను... మళ్ళీ లైన్ లోకి వేణు స్వామి..!
ఇప్పుడు నాగచైతన్య, సమంత ఇష్యూ టాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

venu Swami : ఇప్పుడు నాగచైతన్య, సమంత ఇష్యూ టాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.. అయితే ఈ ఇష్యూ పైన అటు సమంత కానీ.. ఇటు నాగచైతన్య కానీ.. చివరికి అక్కినేని ఫ్యామిలీ కూడా స్పందించకపోవడంతో ఇష్యూ రోజురోజుకు పెద్దదవుతుంది. ఇది పక్కన పెడితే.. ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి నాగచైతన్య, సమంత విడిపోతారంటూ మూడేళ్ళ క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పైన ఇప్పుడాయన స్పందిస్తూ.. తాను మూడేళ్ల క్రితమే ఈ విషయాన్నిచెప్పానంటూ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ ఆయన తాజా ఇంటర్వ్యూలో ఏం అన్నారంటే... "నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. అలాగే నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. సమంత అమావాస్య నాడు పుట్టింది.. దాని వల్ల చైతూకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పాను. సినిమాల పరంగా ఇద్దరికీ ఇబ్బంది లేదు.. గొప్పగా రాణిస్తారు కూడా.. పెళ్లి చేసుకున్నా సమంత సినిమాల్లో కంటిన్యూ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story