Venu Thottempudi: పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వేణు.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Venu Thottempudi: ఇప్పటికే ఎంతోమంది సీనియర్ నటీనటులు.. టాలీవుడ్‌లో తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అందులో చాలామంది సూపర్ సక్సెస్ అయ్యి.. బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అయిపోయారు. ఒకప్పటి హీరోహీరోయిన్లకు ఇప్పుడు తెలుగులో బాగా క్రేజ్ ఉంది. అందుకే సీనియర్ హీరో వేణు కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమవుతున్నాడు.
ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వేణు తొట్టెంపూడి. అలా కామెడీ సినిమాలతోనే క్రేజ్ సంపాదించుకొని ఇండస్ట్రీలో బిజీ హీరో అయిపోయాడు వేణు. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు.. సినిమాలకు దూరమయ్యాడు. 'చింతకాయల రవి', 'దమ్ము' వంటి చిత్రాల్లో కీ రోల్స్‌లో మెరిసినా.. ఆ తర్వాత మళ్లీ తన బ్రేక్‌ను కంటిన్యూ చేశాడు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 'రామారావు ఆన్ డ్యూటీ'తో వచ్చేస్తున్నాడు.
శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న చిత్రమే రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడు రవితేజ. ఈ సినిమాతో వేణు రీ ఎంట్రీకి ప్లాన్ చేశాడు. ఇందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వేణు కనిపించనున్నాడు. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ నుండి వేణు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.v
Our favourite #VenuThottempudi will be live to talk about #RamaRaoOnDuty and much more 💥🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) July 6, 2022
Tune into Instagram and Facebook of @SLVCinemasOffl 🔥#RamaRaoOnDutyOnJuly29
Mass Maharaja @RaviTeja_offl @directorsarat #AnveshiJain @SamCSmusic @RTTeamWorks pic.twitter.com/g0ORirHDic
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com