Venu Thottempudi: వేణుకు మరో భారీ ఆఫర్.. సూపర్ స్టార్ సినిమాలో..

Venu Thottempudi: వేణుకు మరో భారీ ఆఫర్.. సూపర్ స్టార్ సినిమాలో..
Venu Thottempudi: వేణు తొట్టెంపూడి.. ఆరు అడుగుల అందగాడిగా ఒకప్పుడు టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న హీరో.

Venu Thottempudi: ప్రస్తుతం ఫేడవుట్ అయిపోయిన హీరోహీరోయిన్లు ఎంతోమంది మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ కూడా సీనియర్ నటులను సినిమాలో పెట్టడం వల్ల వారి సినిమాలపై మరింత ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకే ఇక సినిమాలు వద్దు అనుకున్న వారిని కూడా ఒప్పించి నటించేలా చేస్తున్నారు. అలాగే 'రామారావు ఆన్ డ్యూటీ' కోసం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు వేణు.

వేణు తొట్టెంపూడి.. ఆరు అడుగుల అందగాడిగా ఒకప్పుడు టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న హీరో. కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నా కూడా ఏ పాత్ర అయినా ఈజీగా చేయగలనని నిరూపించుకున్నాడు. ఎన్నో వరుస హిట్స్ తర్వాత వేణుకు ఫ్లాప్స్ ఎదురయ్యాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆ తర్వాత తానే స్వయంగా సినిమాలకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ రామారావు ఆన్ డ్యూటీ కథ తనకు నచ్చడంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

రవితేజ హీరోగా వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కానీ వేణు క్యారెక్టర్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఇప్పుడు మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో కూడా వేణును ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని ఆలోచిస్తున్నారట మేకర్స్. అయితే త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్న రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్‌లో 'స్వయంవరం', 'చిరునవ్వుతో' చిత్రాలు వచ్చాయి. ఈ రూమర్స్ నిజమయితే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వేణు చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story