అచ్చం కృతీ శెట్టిలా ఉంది కదూ...ఎవరీమే?

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది నటి కృతీ శెట్టి.. ఈ అమ్ముడు అందానికి, అభినయానికి అంతా ఫిదా అయిపోయారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో కృతీ శెట్టికి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో జతకడుతుంది ఈ భామ.
ఇక ఇదిలావుండగా అచ్చం ఈ బెబమ్మను పోలిన ఓ నటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కృతీ సిస్టర్ అని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ నటి ఎవరంటే.. ఈమె పేరు విద్య విను మోహన్. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం సన్ టీవీలో ప్రసారమయ్యే వల్లి సీరియల్‌తో బుల్లితెర మీద అడుగు పెట్టింది. సీరియల్స్ చేస్తూనే మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఈ నటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com