Vijay Devarakonda: 'ఇది నా పర్సనల్ కల'.. బాలీవుడ్‌కు వెళ్లడంపై విజయ్ కామెంట్స్..

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం 'లైగర్' ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా నుండి ఏ అప్డేట్ రాకపోతే.. విజయ్ మీద ఉన్న అభిమానంతో అంచనాలు పెంచేసుకున్నారు ఫ్యాన్స్. అందుకే హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఓ పండగలాగా జరిగింది. హైదరాబాద్‌లో ఈవెంట్ ముగిసిన తర్వాత ముంబాయ్‌లో ట్రైలర్ లాంచ్‌కు బయల్దేరింది మూవీ టీమ్. అక్కడ ఈవెంట్‌లో విజయ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విజయ్ దేవరకొండ ఇప్పటివరకు అన్ని సినిమాలు దాదాపుగా తెలుగులోనే చేశాడు. 'నోట' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ బాలీవుడ్ వైపు మాత్రం ఇప్పటివరకు విజయ్ అడుగుపడలేదు. లైగర్‌తో హిందీలో కూడా డెబ్యూకు సిద్ధమయ్యాడు. అయినా ఇప్పటివరకు ఒక్క బాలీవుడ్ చిత్రంలో కూడా నటించకుండానే అక్కడ యూత్‌లో విజయ్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
లైగర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో 'మీరు బాలీవుడ్‌కు రావడం.. బాలీవుడ్‌కు వరమా లేక సౌత్ ఇండస్ట్రీకి వరమా?' అని అడిగారు జర్నలిస్ట్. దానికి విజయ్ 'నేను అది నా కల నేరవేరడం అని అనుకుంటాను. నా కెరీర్‌లో నా పర్సనల్ కల. నాకు కథలు చెప్పడం ఇష్టం. ఎక్కువమందికి చెప్పడం ఇష్టం. ఇండియాకంటే పెద్ద ఆడిటోరియం ఏముంటుంది? నేను దీన్ని నా కల, నా ఆశయం ప్రాణం పోసుకుంటున్నట్టుగా భావిస్తున్నాను' అని సమాధానం ఇచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com