Vijay Devarakonda: డైరెక్టర్‌తో విజయ్ హ్యాట్రిక్ సినిమా.. అలాంటి కథతో రెడీ..

Vijay Devarakonda: ఒక దర్శకుడి పనితనం హీరోలకు నచ్చితే మళ్లీ మళ్లీ వారితో సినిమా చేయాలని కోరుకుంటారు. అవకాశం వస్తే వదులుకోరు. కానీ ఒకే దర్శకుడితో ఒక హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఆ సాహసం చేయనున్నాడు. పూరీ జగన్నాధ్‌తో హ్యాట్రిక్ మూవీకి సిద్ధమయ్యాడు. అయితే ఈ హ్యాట్రిక్ మూవీ కథ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో 'లైగర్' చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ కెరీర్‌లో ఇదే మొదటి పాన్ ఇండియా చిత్రం. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే విజయ్‌కు 'జన గణ మన' స్టోరీ చెప్పాడు పూరీ. ఆ కథ కూడా తనకు బాగా నచ్చడంతో లైగర్ తర్వాత కమిట్మెంట్‌ను కూడా పూరీకే ఇచ్చేశాడు. ఇక వీరి కాంబినేషన్‌లోనే హ్యాట్రిక్ మూవీ కూడా రాబోతుందని గత కొంతకాలంగా రూమర్స్ వైరల్ అయ్యాయి.
విజయ్, పూరీ హ్యాట్రిక్ మూవీ కోసం దర్శకుడు ఓ సోషియో ఫాంటసీ కథను రెడీ చేయనున్నట్టు సమాచారం. అంటే ఈ కథ 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'యమదొంగ` తరహాలో ఉండనుందట. ఇప్పటికే సోషియో ఫాంటసీ నేపథ్యంతో 'దేవుడు చేసిన మనుషులు' సినిమాను తెరకెక్కించాడు పూరీ. కానీ ఆ మూవీ డిసాస్టర్‌గా నిలిచింది. మరోసారి విజయ్‌తో అదే ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారైనా అది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com