Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబో.. ముచ్చటగా మూడోసారి..

Vijay Devarakonda: కొన్నిసార్లు హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అందుకే వారు కూడా మళ్లీ మళ్లీ ఆ కాంబినేషన్‌ను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బ్యాక్ టు బ్యాక్ ఒకే దర్శకుడితో కలిసి సినిమా చేయడమనేది ఏ హీరోకు అయినా కష్టమే. కానీ విజయ్ దేవరకొండ అది చేసి చూపిస్తున్నాడు. పూరీతో కలిసి మూడోసారి విజయ్ పనిచేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.
విజయ్ దేవరకొండ.. ఇప్పటివరకు కేవలం తెలుగు చిత్రాల్లోనే నటిస్తూ.. ఇతర భాషా పరిశ్రమల్లో కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. అందుకే తన క్రేజ్‌తో పూరీ డైరెక్షన్‌లో నటించే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది.
లైగర్ మూవీ రిలీజ్ అవ్వకముందే పూరీ.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన'లో కూడా విజయ్‌నే హీరో అని అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ లాంచ్ కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత పూరీ డైరెక్షన్‌లోనే విజయ్ మరో సినిమాలో నటించనున్నాడని ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఒకే దర్శకుడితో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేసిన హీరోగా విజయ్ దేవరకొండ రికార్డ్ సాధిస్తాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com