Vijay Devarakonda: రౌడీ ఫ్యాన్స్ కి నిరాశే... పూరీ టీం ఏం చెప్పుందంటే..!

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' ఉపశీర్షిక. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో ఈ సినిమా తెరక్కుతుంది.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్ వస్తోందని అభిమానులు ఆశించారు. కానీ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.
ఈ క్రమంలో పూరీ అండ్ టీమ్ అభిమానుల కోసం ఓ పోస్ట్ ను పెట్టింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది. పవర్‌ప్యాక్డ్ అంశాలతో కూడిన 'లైగర్' టీజర్‌ని మే 9న విడుదల చేయాలని భావించాం. కానీ ప్రస్తుత పరిస్థితులు చూశాక టీజర్ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే మరో కొత్త తేదీతో మీ ముందుకు వస్తామని అన్నారు.
విజయ్ ని ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారని, ఆయన లుక్స్, డైలాగ్స్ పట్ల మీరు నిరాశ చెందే అవకాశం ఉండదని పేర్కొన్నారు. దయచేసి అందరు ఇంట్లోనే ఉండి, వ్యాక్సిన్ వేయించుకోండి. ధైర్యంగా ఉండాలని పూరీ టీం పేర్కొంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరీ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com