టాలీవుడ్

Vijay Devarakonda: లేడీ ఫ్యాన్ వీపుపై విజయ్ ఫేస్‌ టాటూ.. వీడియో వైరల్..

Vijay Devarakonda: ప్రస్తుతం లైగర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విజయ్‌ను చెర్రీ, సోనాలీ అనే ఇద్దరు ఫ్యాన్స్ కలిశారు.

Vijay Devarakonda: లేడీ ఫ్యాన్ వీపుపై విజయ్ ఫేస్‌ టాటూ.. వీడియో వైరల్..
X

Vijay Devarakonda: అభిమానుల ప్రేమకు అంతే ఉండదు. ఒక్కసారి ఎవరినైనా వారి ఫేవరెట్ అనుకున్నారంటే వారికోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడిపోతుంటారు. అబ్బాయిలకు మాత్రమే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ఇటీవల తన లేడీ ఫ్యాన్.. విజయ్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అర్జున్ రెడ్డి చిత్రంతో ఎంతోమంది అమ్మాయిలకు క్రష్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. పైగా ఆఫ్ స్క్రీన్ విజయ్ ప్రవర్తన కూడా చాలామందికి ఇష్టం. దేనికీ భయపడకుండా స్టేజ్‌పై విజయ్ మాట్లాడే మాటలు.. యూత్‌లో తనకు బాగా క్రేజ్ సంపాదించి పెట్టాయి. దీంతో ఎంతోమంది అభిమానులు ఒక్కసారి విజయ్‌ను నేరుగా కలవాలని కోరుకుంటున్నారు. తాజాగా ఆ లక్కీ ఛాన్స్ ఓ ఫ్యాన్‌కు లభించింది.

ప్రస్తుతం లైగర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విజయ్‌ను చెర్రీ, సోనాలీ అనే ఇద్దరు ఫ్యాన్స్ కలిశారు. విజయ్‌ను కలిసి తనతో కాసేపు మాట్లాడిన చెర్రీ.. తన వీపుపై వేయించుకున్న విజయ్ దేవరకొండ ఫేస్ టాటూని విజయ్‌కు చూపించి ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత వారిద్దరూ విజయ్‌తో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES