Vijay Devarakonda: రీమేకులు, ఫ్రీమేకులు నాకు ఇష్టం ఉండదు: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: రీమేకులు, ఫ్రీమేకులు నాకు ఇష్టం ఉండదు: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda: లైగర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vijay Devarakonda: లైగర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ఈసినిమా పై ఇప్పటికే భారీగా అంచానాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా అమ్మనాన్న ఓ తమిళమ్మాయి సినిమా సిక్వెల్‏గా రాబోతుందంటూ వస్తున్న వార్తలపై.. విజయ్ స్పందించారు.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం చాలా సార్లు చూశానని.. రీమేకులు ఫ్రీమేకులు తనకు ఇష్టం ఉండదని.. ఆ సినిమా కథతో కొంచెం పోలిక ఉంటే అస్సలు చేయను కదా అంటూ.. విజయ్ తెలిపాడు. అంతే కాకుండా లైగర్ లో వున్నది బాక్సింగ్ కాదని.. ఎంఎంఎ అనే మార్షల్ ఆర్ట్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో నచ్చిందని.. లైగర్ పాత్రని చాలా మిస్ అవుతున్నానంటూ వెల్లడించాడు. మార్సల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనుండడంతో.. ఈ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లోనే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story