Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ నటి కాదు..! ఆ మాటలకు అర్థం అదే..
Vijay Devarakonda: మామూలుగా టాలీవుడ్ యంగ్ హీరోల రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. వారికి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా.. ఉంటే ఎవరు అని ఆరాతీయడానికి ఇష్టపడతారు. కానీ అందులో కొందరి హీరోల పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా బయటపడుతుంది. ప్రస్తుతం చాలావరకు ప్రేక్షకుల ఆసక్తి అంతా విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ స్టేటస్‌పైనే ఉంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ఎంతోమంది అమ్మాయిలకు క్రష్‌గా మారిపోయాడు. ముఖ్యంగా యూత్‌లో ఈ హీరోకు చాలా క్రేజ్ ఉంది. అయితే ఇప్పటివరకు తనతో రెండు హిట్ సినిమాలు కలిసి చేసిన రష్మికనే విజయ్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ రూమర్స్ వస్తున్నా వీరిద్దరూ మాత్రం కేవలం స్నేహితులమనే చెప్పుకుంటారు. తాజాగా తన రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్.
ప్రస్తుతం లైగర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండకు ఎక్కడికి వెళ్లినా తన రిలేషన్‌షిప్ గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. తన పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టడం తనకు ఇష్టముండదు అంటూ క్లారిటీ ఇచ్చాడు విజయ్. నటుడిగా పబ్లిక్ లైఫ్‌లో ఉండడం తనకు ఇష్టమే అని చెప్పుకొచ్చాడు. అయితే బ్లిక్‌లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదంటూ విజయ్ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ హీరో ప్రేమిస్తుంది ఇండస్ట్రీలో అమ్మాయిని కాదా? ఇంతకీ తన మాటలకు అర్థమేంటి అని అభిమానులు అయోమయంలో పడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com