Vijay Devarakonda: 'అలాంటప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా వేస్ట్'

Vijay Devarakonda: అలాంటప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా వేస్ట్
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమే 'లైగర్'.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమే 'లైగర్'. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ జగన్నాధే నిర్మాతగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. మరో నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరించాడు. అనన్య పాండే హీరోయిన్‌గా ఆడిపాడింది. అయితే లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ అంతా దేశమంతటా తెగ చక్కర్లు కొట్టేస్తున్నారు. ఇదే సందర్భంలో విజయ్ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి.

లైగర్ ప్రమోషన్స్ కోసం ఆ సిటీ, ఈ సిటీ అని తేడా లేకుండా దేశమంతా చుట్టేస్తోంది మూవీ టీమ్. మూవీ రిలీజ్‌కు ఇంకా రెండే రోజులు సమయం ఉండడంతో ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచింది. హిందీలో భారీ లాభాలు పొందడం కోసం అక్కడ మార్కెట్‌ను టార్గెట్ చేసింది లైగర్ టీమ్. అందుకే అక్కడ కూడా విజయ్, అనన్య కలిసి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

'నేనెప్పుడు నాకు నచ్చిందే చేస్తాను' అంటూ తన గురించి చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. 'అనిపించి మాట్లాడతాను, నచ్చినట్టు ఉంటాను. అదే నాకు ఇష్టం. అన్నింటికన్నా అదే ముఖ్యం. మన లైఫ్ మనకు నచ్చినట్లు లేకుండా మనకు నచ్చినట్లు బతకలేకపోతే.. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా వేస్ట్. అలాంటప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ప్రయోజనం ఉండదు' అని తెలిపాడు. అయితే ఈ మాటలు నెపోటిజం కిడ్స్‌ను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. లైగర్ ప్రమోషన్స్ మొదలయినప్పటి నుండి విజయ్ ఎవరినో ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తున్నాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story