Vijay Devarakonda: 'మేజర్' మూవీపై విజయ్ దేవరకొండ రివ్యూ.. కచ్చితంగా చూడాలంటూ..

Vijay Devarakonda: మేజర్ మూవీపై విజయ్ దేవరకొండ రివ్యూ.. కచ్చితంగా చూడాలంటూ..
Vijay Devarakonda: అడవి శేష్ నటించిన మేజర్ మూవీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరోల్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మరో నటుడు అడవి శేష్. అడవి శేష్ సినిమా అనగానే కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని ఇప్పటికే చాలామంది ఫిక్స్ అయిపోయారు. అలాంటి అడవి శేష్ ముంబాయి 26/11 దాడుల్లో రియల్ హీరోగా పోరాడి వీర మరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ 'మేజర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఈ మూవీ చూసిన విజయ్ దేవరకొండ.. ట్విటర్‌లో తన రివ్యూను అందించాడు.

అడవి శేష్ నటించిన మేజర్ మూవీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓవైపు ప్రేక్షకుల ఆదరణతో పాటు కలెక్షన్ల విషయంలో కూడా దూసుకెళ్తోంది. అందుకే సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకు తమ రివ్యూలు ఇస్తూ.. టీమ్‌కు అభినందనలు చెప్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్.. మేజర్‌పై తన రివ్యూను ఇచ్చేశాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

'ప్రేమ, నిజాయితితో నిండిన సినిమానే మేజర్. తలెత్తి చూడాల్సిన ఓ వ్యక్తి. తనని చూసి మనమందరం నేర్చుకోవాల్సిన వ్యక్తి. ఇక నిజమైన ఐడల్. మన హీరో గురించి తెలుసుకోవడానికి ఈ సినిమా తప్పకుండా చూడండి. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. మేజర్ సందీప్ తల్లిదండ్రులకు నా ప్రేమ, గౌరవం' అని ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.


Tags

Read MoreRead Less
Next Story