13 Sep 2022 3:29 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Vijay Devarakonda :...

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండకు ఫ్యాన్స్ భారీ సపోర్ట్..

Vijay Devarakonda : లైగర్ ప్రమోషన్స్ రిలీజ్ తరువాత విజయ్ దేవరకొండ మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండకు ఫ్యాన్స్ భారీ సపోర్ట్..
X

Vijay Devarakonda : లైగర్ ప్రమోషన్స్ రిలీజ్ తరువాత విజయ్ దేవరకొండ మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. లైగర్ ఫ్లాప్ అయిన తరువాత విజయ్ ఎలా స్పందిస్తాడోనని అందరూ ఎదురుచూశారు. తాజాగా 'సింగిల్ ప్లేయర్' అంటూ విజయ్ దేవరకొండ ఓ క్లాసిక్ పిక్‌ను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు 19 గంటల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. వేల సంఖ్యలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేవాలి.. నీ సినిమా ఫ్లాప్ అయినా నువ్వు నిజమైన లైగర్‌వి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లైగర్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో మేకర్స్ మీడియాకు కనిపించకుండా పోయారు. చార్మీ.. కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటానని పోస్ట్ చేసింది. పూరీ జగన్నాద్ మీడియాతో మాట్లాడి చాలా రోజులైంది. ఇక పూరీ, విజయ్ కాంబినేషన్‌లో 'జనగణమన' సెట్స్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అర్ధాంతరంగా ఆపేశారని టాక్ వైరల్ అయింది. జనగణమన మూవీ ఇంక వెనక్కిపడిపోయినట్లేనని అనుకుంటున్నారు. అయితే విజయ్, సమంత కలిసి నటించిన ఖుషి చిత్రం డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. శివ నిర్వణ దీనికి దర్శకత్వం వహించారు. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇది విడుదల కానుంది.

Next Story