Vijayashanthi: 'టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడకలేదు'

Vijayashanthi: టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడకలేదు
Vijayashanthi: ఇటీవల విడుదలయిన ‘లాల్ సింగ్ చడ్డా’ రిజల్ట్‌పై కూడా అలాగే స్పందించారు విజయశాంతి.

Vijayashanthi: సినీ పరిశ్రమలో ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విజయశాంతి.. ఇప్పుడు రాజకీయాల్లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాజకీయాలపైనే ఉంది. కానీ తనకు నచ్చని విషయం ఏది జరిగిన సోషల్ మీడియా ద్వారా దానిపై స్పందించడం విజయశాంతికి అలవాటు. అలాగే ఇటీవల విడుదలయిన 'లాల్ సింగ్ చడ్డా' రిజల్ట్‌పై కూడా అలాగే స్పందించారు విజయశాంతి.

అమీర్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమే 'లాల్ సింగ్ చడ్డా'. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరోహీరోయిన్లు ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ అయితే ప్రతీ భాషలో ఇంటర్వ్యూలో ఇచ్చాడు. తెలుగులో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి చిరంజీవి, నాగార్జునలాంటి స్టార్ హీరోలను దింపాడు. అయినా కూడా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.

లాల్ సింగ్ చడ్డా చిత్రం తెలుగులో కనీస వసూళ్లు సాధించే అవకాశం కూడా పెద్దగా లేదని రివ్యూలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇంతలోనే నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'కార్తికేయ 2'కు హిట్ టాక్ రావడం లాల్ సింగ్ చడ్డాకు మరో దెబ్బ. అయితే ఇప్పటికే బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్‌తో లాల్ సింగ్ చడ్డా చిత్రంపై విమర్శలు గుప్పించిన విజయశాంతి.. మరోసారి ఈ సినిమా రిజల్ట్‌పై పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ మూవీని ప్రమోట్ చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలపై కూడా విరుచుపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story