Vijayashanthi: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లపై విజయశాంతి ఫైర్.. వరుస ట్వీట్లతో అటాక్..

Vijayashanthi: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లపై విజయశాంతి ఫైర్.. వరుస ట్వీట్లతో అటాక్..
Vijayashanthi: లాల్ సింగ్ చడ్డా బాయ్‌కాట్‌ను తాను కూడా సమర్థింస్తున్నట్టు పోస్ట్ చేసింది విజయశాంతి.

Vijayashanthi: సినీ పరిశ్రమలో ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విజయశాంతి.. ఇప్పుడు రాజకీయాల్లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాజకీయాలపైనే ఉంది. తాజాగా విజయశాంతి.. తన ట్వీట్లతో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలను టార్గెట్ చేశారు. వరుసగా ట్వీట్లతో వారిపై అటాక్ చేశారు. దీనికి కారణం అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' చిత్రం.

'ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నరు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమీర్ అన్నారు.' అంటూ అమీర్ ఖాన్‌పై విరుచుకుపడింది విజయశాంతి.


'ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమీర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ వాస్తవమేంటో తెలిసిన ప్రజలు ఆమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు. గతంలో ఆమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి.'

ఇలా లాల్ సింగ్ చడ్డా బాయ్‌కాట్‌ను తాను కూడా సమర్థింస్తున్నట్టు పోస్ట్ చేసిన విజయశాంతి.. ఈ మూవీని సౌత్ నుండి సపోర్ట్ చేస్తున్న స్టార్ హీరోలను కూడా విమర్శించింది. 'జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు ఆమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీషోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి.' చిరంజీవి, నాగార్జునలాంటి స్టార్ హీరోలు లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో విజయశాంతి వారినే టార్గెట్ చేసి మాట్లాడారని స్పష్టంగా అర్థమవుతోంది.


Tags

Read MoreRead Less
Next Story