Vijayashanti: విజయశాంతి బర్త్ డే స్పెషల్.. ఆ రెండు సినిమాల తర్వాత స్టార్స్‌కు దూరంగా..

Vijayashanti: విజయశాంతి బర్త్ డే స్పెషల్.. ఆ రెండు సినిమాల తర్వాత స్టార్స్‌కు దూరంగా..
Vijayashanti: నటి విజయశాంతి గ్లామరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన భారతనారి.

Vijayashanti: చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లామరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన భారతనారి. హీరో స్వామ్యం నడిచే ఇండస్ట్రీలో నటిగా దాన్ని ప్రతిఘటించిన ధీశాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. అబితాబ్ బచ్చన్, రజినికాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ విజయశాంతి.


డబ్బింగ్ చిత్రాలతోనే తమిళనాట నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన అరుదైన నటీమణి విజయశాంతి పుట్టిన రోజు ఇవాళ. జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు.


భారతీరాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలాకాలమే నిరీక్షించాల్సి వచ్చింది. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్లుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు. 1980ల సగం నుంచి 90 వరకూ విజయశాంతి కెరీర్ పీక్స్ లో కొనసాగింది.


ఈ టైమ్ లో ఆమె ఏం చేసినా హిట్టే అన్నట్టుగా సాగింది కెరీర్. తనే ప్రధాన పాత్రగా ఉన్నా.. హీరోల సరసన కేవలం గ్లామర్ డాళ్ గా ఆడిపాడినా.. అచ్చ తెలుగు ఆడపిల్లగా అయినా.. విజయశాంతి ఈ ఐదారేళ్ల కాలంలో చేసిన పాత్రలు.. సినిమాలు.. అన్నీ సూపర్ హిట్సే. ఓ రకంగా అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది.


కర్తవ్యం ఇంపాక్ట్ తో ఆ తర్వాత దాదాపు తనే ప్రధాన పాత్రలో చాలా సినిమాలే చేసింది. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి. ఇదే టైమ్ లో మరికొన్ని గ్లామర్ పాత్రలనూ పోషించింది. బాలయ్యతో నిప్పురవ్వ, చిరంజీవితో మెకానిక్ అల్లుడు తర్వాత ఆమె స్టార్ హీరోల సరసన నటించలేదు. అయితే వీటితో పాటు ఆమె చేసిన మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫట్ మన్నాయి. ఆ టైమ్ లో వచ్చిన ఓ చిత్రం తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులూ తుడిచేసింది. అదే ఓసేయ్ రాములమ్మా.



Tags

Read MoreRead Less
Next Story