ఆ ఇద్దరు స్టార్ హీరోలకి జోడిగా నటించలేకపోయిన విజయశాంతి..!
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి హీరోయిన్ కి స్టార్ హీరోలందరితో నటించాలనే కోరిక ఉంటుంది. కానీ అందరికి ఆ ఛాన్స్ రాకపోవచ్చు. ఆ తర్వాత ఆ హీరోతో నటించాలని అనుకున్నాను అంటూ చాలా బాధపడుతుంటారు హీరోయిన్లు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అయిన ఎన్టీఆర్,ఏఎన్నార్ లతో జోడిగా నటించేందుకు చాలా మంది హీరోయిన్లు పోటీ పడేవారు.
సావిత్రి, జమున, వాణిశ్రీల నుంచి రాధిక, రాధల వరకు వీరితో నటించేందుకున పోటీ పడ్డారు. అయితే రాధిక, రాధలకి పోటీగా నిలిచిన విజయశాంతి మాత్రం ఎన్టీఆర్,ఏఎన్నార్ లతో జోడిగా నటించలేకపోయింది. కానీ విచిత్ర్రం ఏంటంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు హీరోలుగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్యం శివం' సినిమాలో విజయశాంతి నటించింది. ఇందులో వీరికి చెల్లెలుగా విజయశాంతి కనిపిస్తుంది.
ఇక చిరంజీవి హీరోగా వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమాలో ఏఎన్నార్ కి కూతురిగా నటించి మెప్పించింది విజయశాంతి. అటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో జోడిగా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com