Cobra Movie OTT : 'కోబ్రా' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

X
By - Sai Gnan |13 Sept 2022 10:00 PM IST
Cobra Movie OTT : విక్రమ్ ‘కోబ్రా’ మూవీ ఓటీటీ అప్డేట్స్ వచ్చేశాయి
Cobra Movie OTT : విక్రమ్ 'కోబ్రా' మూవీ ఓటీటీ అప్డేట్స్ వచ్చేశాయి. ఆగస్టు 31న ఈ సినిమా థియేటర్లలో తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయింది. అయితే ఆశించినంతగా ఈ మూవీ విజయం సాధించలేకపోయింది. జ్ఞానముత్తు దీనికి దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇర్ఫాన్ పథాన్ మెయిన్ సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు.
కథ బాగున్నా అంతగా ఆడలేదు. దీనికి ప్రధాన కారణం ఎడిటింగ్ లోపం అన్నారు మేకర్స్. ఇక విక్రమ్ ఇందులో దాదాపు 6 క్యారెక్టర్స్‌లో నటించిడం హైలైట్. సోనీ లివ్ 'కోబ్రా' శాటిలైట్ రైట్స్‌ను భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 23 లేదా 30న సోనీ లివ్‌లో స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com