Mahesh Babu : ఛత్రపతి శివాజీగా మహేష్ బాబు?

Mahesh Babu : ఛత్రపతి శివాజీగా మహేష్ బాబు?
X
ఈ సినిమాలో మహేష్ బాబు ఛత్రపతి శివాజీగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలోని ఎక్కువభాగం కూడా ఆఫ్రికా అడువుల్లో జరగనున్నట్లుగా తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పైన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఛత్రపతి శివాజీగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలోని ఎక్కువభాగం కూడా ఆఫ్రికా అడువుల్లో జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాజమౌళి బృందం లోకేషన్ వేటను కూడా మొదలుపెట్టిందట. మహేష్ బాబు ఛత్రపతి శివాజీగా కనిపించనున్నాడని తెలియగానే ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట సినిమాని చేస్తుండగా, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి RRR అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

Tags

Next Story