Pawan Kalyan: క్రేజీ కాంబినేషన్ ఫిక్స్.. 'విరాటపర్వం' డైరెక్టర్ టాలెంట్‌కు పవన్ ఫిదా..

Pawan Kalyan: రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'విరాటపర్వం' విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక విప్లవాత్మక ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు ఊడుగుల. ఈ మూవీలో రానా, సాయి పల్లవి యాక్టింగ్‌తో పాటు వేణు ఊడుగుల డైరెక్షన్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. దీంతో మెగా హీరో సైతం తనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఓవైపు రాజకీయాలను, మరోవైపు సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 'వకీల్ సాబ్' చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించిన పవన్.. ఆ మూవీ హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను సైన్ చేశాడు. అయితే త్వరలోనే మళ్లీ రాజకీయాల్లో బిజీ కానున్న పవన్.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌ను ఎలా పూర్తి చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ఇప్పుడు మరో మూవీకి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త వైరల్‌గా మారింది.
విరాటపర్వం విడుదల అవ్వకముందే వేణు ఊడుగుల.. పవన్ కళ్యాణ్‌కు ఓ కథ వినిపించాడట. ఆ కథ పవన్‌కు బాగా నచ్చిందట కూడా. అయితే చేతిలో ఉన్న సినిమాలనే ఇంకా పూర్తి చేయని పవన్ కళ్యాణ్.. వేణు ఊడుగులతో సినిమా చేయడానికి ఇంకెంత సమయం పడుతుందో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి ఈ కాంబినేషన్ కచ్చితంగా సెట్స్‌పైకి వెళ్తుందా లేదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com