19 Jun 2022 1:35 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Virata Parvam OTT:...

Virata Parvam OTT: ఓటీటీలో 'విరాటపర్వం'కు డిమాండ్.. భారీ మొత్తంతో డీల్ ఫిక్స్..

Virata Parvam OTT: వేణూ ఊడుగుల డైరెక్షన్‌లో రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమే ‘విరాటపర్వం’.

Virata Parvam OTT: ఓటీటీలో విరాటపర్వంకు డిమాండ్.. భారీ మొత్తంతో డీల్ ఫిక్స్..
X

Virata Parvam OTT: థియేటర్లలో విడుదల అవ్వని సినిమాలకే ఓటీటీలు భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేస్తున్నాయి. అలాంటి థియేటర్లలో విడుదలయ్యి హిట్ టాక్ అందుకున్న తర్వాత అలాంటి సినిమాలను ఓటీటీలు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే థియేటర్లలో విడుదలవ్వగానే ఓటీటీలు రైట్స్ కోసం ఎగబడుతున్నాయి. తాజాగా విడుదలయిన విరాటపర్వంకు ప్రస్తుతం ఓటీటీల్లో భారీగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.

వేణూ ఊడుగుల డైరెక్షన్‌లో రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమే 'విరాటపర్వం'. జూన్ 17న విడుదలయిన ఈ సినిమా మంచి టాక్‌తో ముందుకెళ్తోంది. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి నటన చాలా బాగుందని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. దీంతో మూవీ హిట్ రేసు వైపు పరిగెడుతోంది. ఇంతలోనే ఏ ఓటీటీలో విరాటపర్వం విడుదల కానుందన్న సందేహం మొదలయిపోయింది.

విరాటపర్వం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ.15 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ ఈ రైట్స్‌ను కొనుగోలు చేసిందని సమాచారం. చాలాకాలం క్రితం మొదలయ్యి, ఎన్నో వాయిదాలు పడిన చిత్రం కావడంతో విరాటపర్వంపై అంచనాలు తగ్గిపోయాయి అనుకున్నారు విమర్శకులు. కానీ ప్రమోషన్స్‌తో చురుగ్గా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది మూవీ టీమ్.

Next Story