Virupaksha : కళ్యాణ్ మామా మీ ప్రేమకు థ్యాంక్యూ : సాయిధరమ్ తేజ్

Virupaksha : కళ్యాణ్ మామా మీ ప్రేమకు థ్యాంక్యూ : సాయిధరమ్ తేజ్
X
నా గురువు పవన్ కళ్యాణ్ అంటూ ఎమోషనల్ అవుతోన్న సాయ్ ధరమ్ తేజ్..

మెగా హీరో సాయిధరమ్ చంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విరూపాక్ష. ఈ సినిమాకు కార్మి దండు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా విరూపాక్ష రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చూయించినట్లు తెలిపింది చిత్ర యునిట్. టీజర్ చాలా బాగా వచ్చిందని పవన్ కళ్యాణ్ అభినందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"విరూపాక్ష నాకు చాలా ముఖ్యమైన సినిమా. నా గురువు పవన్ కళ్యాణ్ గారి ఆశిస్సులు లభించడం నాకు సంతోషాన్నిచ్చింది. కళ్యాణ్ మామా మీ ప్రేమకు, ప్రశంసలకు ఎప్పుడూ నాతో ఉన్నందుకు ధ్యాంక్యూ అని అన్నారు" సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాకు కార్తి దండు దర్శకత్వం వహిస్తుండగా, బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. అజనీష్ లోక్ సంగాతాన్ని అందిస్తున్నారు.

Tags

Next Story