Manchu Vishnu : ఎందుకు అంకుల్... నేను ఏం చేశానని మీకంత కోపం.. మీ ముందు పెరిగాను..!

Manchu Vishnu : మా ఎన్నికల నేపధ్యంలో సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యల పైన విష్ణు మంచు స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశాడు.. ఇందులో విష్ణు ఏం మాట్లాడాడంటే... " నేను మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని తెలియగానే ప్రత్యర్థి ప్యానెల్ సభ్యులు నా పైన, నా కుటుంబం పైన విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత మనమంతా ఒకే కుటుంబం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళ మాటలు నాకు బాదేశాయి. . అవును.. ఇదంతా నాగబాబుగారి గురించే.. ఎందుకు అంకుల్... నేను ఏం చేశానని మీకంత కోపం. నేనేంటో మీకు తెలియదా? మీ ముందు నేను పెరిగాను.. మా సంస్థ నుంచి వచ్చిన సినిమాల్లో మీరు నటించారు.
మా కుటుంబం మీకు ఎంతో గౌరవం ఇస్తాం.. నాకు చిరంజీవిగారు అంటే ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవం. మిమ్మల్ని విమర్శిస్తే ఆయనను విమర్శించినట్టే అవుతుంది. తెలుగులో నాకు మార్కులు తక్కువే రావచ్చు. కానీ, క్యారెక్టర్ విషయంలో మార్కులు వేయాల్సి వస్తే, ఎవరికి ఎక్కువ వస్తాయో ఇండస్ట్రీ వాళ్లను అడగండి. మీరు అలా మాట్లాడటం నాకు కష్టంగా ఉంది. నా ప్రత్యర్ధి పవన్ కల్యాణ్ గురించి గతంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.. ఆయనను తిడుతూ మీరు సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేశారు.
ఇప్పుడు ఆయన్ని మేధావి అంటూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు. ఏ కుటుంబం పర్‌ఫెక్ట్ కాదు. ప్లీజ్ అంకుల్.. దయచేసి అలా అనొద్దు. నేను పుట్టిన తర్వాత నాన్నగారు ఇంత సహనంతో ఉండటం ఇప్పటివరకూ చూడలేదు. దయచేసి ఆయన్ను బయటకు లాగొద్దు.. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే, బంధాలన్నీ తెగిపోతాయి. వద్దు అంకుల్ .. మీరు నన్ను దీవించండి" అంటూ విష్ణు పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com