Vishwak Sen: డ్రీమ్ కారు కొన్న విశ్వక్ సేన్.. ధర ఎంతంటే..?

Vishwak Sen: డ్రీమ్ కారు కొన్న విశ్వక్ సేన్.. ధర ఎంతంటే..?
Vishwak Sen: ఇటీవల విశ్వక్ నటించిన ‘ఆశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం డీసెంట్ హిట్‌గా నిలిచింది.

Vishwak Sen: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. టాలీవుడ్‌కు వస్తున్న యంగ్ హీరోలు ఎందరినో ప్రేక్షకులు ఆదరించారు. వారిలో టాలెంట్ ఉండి.. స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటే బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదని ఇప్పటికీ ఎంతోమంది నటులు నిరూపించారు. అలాంటి వారిలో ఒకరు విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న విశ్వక్.. తన డ్రీమ్ కారును కొన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం విశ్వక్ సేన్‌ను హీరోగా నిలబెట్టింది. అప్పటినుండి తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ కూడా విశ్వక్ సేన్‌ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఏం జరిగినా తనకు నచ్చింది మాట్లాడడం, నచ్చనిదానిని ఎదిరించడం విశ్వక్‌కు ఫ్యాన్ బేస్ పెరిగేలా చేసింది.

ఇటీవల విశ్వక్ నటించిన 'ఆశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రం డీసెంట్ హిట్‌గా నిలిచింది. దీంతో విశ్వక్ సేన్ తన డ్రీమ్ కారును కొనుగోలు చేసే అవకాశం లభించింది. అయితే ఈ కారు విలువ ఏకంగా రూ.1.5 కోట్లు ఉంటుందని సమాచారం. 'మీ ప్రేమ, సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. థాంక్యూ' అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కారుతో దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు విశ్వక్. అయితే ఆ కారు నాదేనని, ఫోటోలు దిగుతానంటే ఇచ్చానని తరుణ్ భాస్కర్ ఫన్నీ కామెంట్ పెట్టాడు.

Tags

Read MoreRead Less
Next Story