Vishwak Sen: రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. నిర్మాతలకు షాక్..

Vishwak Sen: రెమ్యునరేషన్ విషయంలో నటీనటులు చాలా ఆలోచిస్తారు. తాము నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ తగ్గించడానికి కూడా ఆలోచించని నటీనటులు హిట్ అయితే మాత్రం వారి డిమాండ్‌తో నిర్మాతలకు షాక్ ఇస్తూ ఉంటారు. అందులోనూ ఈమధ్య యంగ్ హీరోలు.. సీనియర్ హీరోలకే పోటీ ఇచ్చే రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఆ లిస్ట్‌లో చేరాడు విశ్వక్ సేన్.
'ఈ నగరానికి ఏమైంది'తో నటుడిగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత తనలో ఓ దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఇక తాజాగా తన రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్.. క్లీన్ హిట్‌ను అందుకున్నాడు. దీంతో రెమ్యునరేషన్ విషయంలో విశ్వక్ నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడట.
ఇంతకు ముందు విశ్వక్ సేన్ నటించిన ప్రతీ సినిమాకు రూ. ఒకటిన్నర నుండి 2 కోట్ల వరకు తీసుకునేవాడట. కానీ అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు తన రెమ్యునరేషన్ రూ.3 కోట్లు అని చెప్తున్నాడట. అంతే కాకుండా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com