25 ఏళ్ల స్నేహం.. సునీతకు సుమ ఇచ్చిన సూపర్ గిప్ట్
మృదు మధురమైన గానం.. ముచ్చటైన రూపం.. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సునీతకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. 19 సంవత్సరాల వయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే ఆమె గాత్రం అందరినీ అలరించింది. పాట ద్వారా, మాట ద్వారా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.. ఎందరో నటీమణులకు గాత్ర దానం చేసిన సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు సంపాదించుకుంది.
ఓ డిజిటల్ మీడియా అధినేత రామ్‌ను వివాహం చేసుకున్నారు. వివాహ వేడుక శంషాబాద్ సమీపంలో అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో జరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా వివాహ వేడుకకు అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.
వివాహ సందర్భంగా సునీతకు అత్యంత ఆత్మీయులైన యాంకర్ ఝాన్సీ, సుమ సందడి చేశారు. సునీతకు సుమ ఓ సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను తన ప్రియమైన ప్రాణ స్నేహితురాలికి ఇచ్చినట్లు తెలిసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com