ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఏమన్నారంటే..

ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఏమన్నారంటే..
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నాయి..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నాయి. ఆయన మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు గుడ్‌న్యూస్‌ చెప్పారు.

గత నాలుగు రోజులుగా ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌. ఈ వీకెండ్ వరకు అభిమానులు సంతోషకరమైన వార్త వింటారన్నారు. అభిమానులు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారన్నారని తెలిపారు. సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ఎస్పీ చరణ్ లేటెస్ట్‌గా విడుదల చేసిన వీడియోలో తెలిపారు.

ఇక.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్నట్లు చెన్నై ఎంజీఎం వైద్యులు స్పష్టం చేశారు. వెంటిలేట‌ర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. బాలు చికిత్సకు స్పందిస్తున్నారన్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్పటిక‌ప్పుడు నిపుణుల బృందం పర్యవేక్షిస్తోంద‌ని పేర్కొన్నారు. గత నెల 5వ తేదీన బాలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story