నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా?

సినిమాల్లో ఫేమస్ అవ్వాలంటే పది చిత్రాలు అవసరం లేదు. ఒకే ఒక్క డైలాగ్ చాలు.. అవును.. ఒక్క డైలాగ్ ఎన్నో సినిమాలని తెచ్చిపెడుతుంది.. ఎక్కడలేని క్రేజ్ ని సంపాదించి పెడుతుంది. అలా ఒక్క డైలాగ్ తో సక్సెస్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. అందులో నటుడు ప్రియదర్శి ఒకరు. పెళ్లి చూపులు సినిమాలో 'నా సావు నేను చస్తా.. నీకెందుకు' అన్న ఒకే ఒక డైలాగ్ అతన్నీ ఇండస్ట్రీలో స్టార్ ని చేసింది.
ఈ సినిమా హిట్ కావడంతో అతనికి మరింతగా పేరు వచ్చింది. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ లలో ప్రియదర్శి ఒకరు. అయితే ప్రియదర్శి వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. పెళ్లి చూపులు సినిమా కంటే ముందే టెర్రర్ అనే సినిమాలో ప్రియదర్శి నటించాడు. సినిమాల్లోకి రాకముందు ప్రియదర్శి హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్ లో పిజీ చేశాడు.
ఆయన తండ్రి పులికొండ సుబ్బచారి ఓ ప్రొఫెసర్. ఈయన కవితలు, పద్యాలు రాసేవాడు. తల్లి జయలక్ష్మి గృహిణి. ప్రియదర్శి చెల్లెలు నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్. ఇక ప్రియదర్శి రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె మంచి నవలా రచయిత్రి. ఈమె స్వస్థలం ఆగ్రా సమీపంలో బృందావనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com