Who Is Lobo : లోబో ఎవరు? అతని అసలు పేరేంటి?
Who Is Lobo : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 నిన్న అట్టహాసంగా మొదలైంది. మొత్తం 19మంది మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోని కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. అయితే గత సీజన్ లో కంటెస్టెంట్ గా మిస్ అయిన లోబో ఈ సారి ఈ సీజన్ లో ఛాన్స్ కొట్టేశాడు. ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిత్రవిచిత్రంగా కనిపించే లోబో పక్కా హైదరాబాదీ బాషలో యాంకరింగ్ చేసి పుల్ పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ లోకి వచ్చాక లోబో గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు.. లోబో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం. స్కూల్ టైంలో దొంగతనం చేసి దొరికిపోవడంతో తొమ్మిదే తరగతికే టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీనితో మధ్యలోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత ఓ టాటూ షాపులో పనిచేశాడు. అక్కడ ఓ రష్యన్ యువతికి తొలి టాటూ వేశాడు. లోబో కట్టుబొట్టు అంతా విచిత్రంగా ఉండడంతో ఆ యువతి అతనికి లోబో అనే పేరు పెట్టేసింది. దీనితో అప్పటినుంచి మహమ్మద్ ఖయ్యూం కాస్త లోబోగా మారిపోయాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com