NTR, ANR ఇందులో ఎవరు పెద్ద?
తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ రెండుకళ్ళు.. ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాదుకి షిఫ్ట్ అవ్వడంలో వీరి పాత్ర అమోఘం. వయసు రిత్యా.. ఎన్టీఆర్ కన్నా సుమారు 16 నెలలు చిన్నవాడు ఏయన్నార్.. ఇక సినీ రంగం విషయంలో మాత్రం ఎన్టీఆర్ కంటే ఏయన్నార్ 5 సంవత్సరాల 10 నెలల సీనియర్.
ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి 'పల్నాటి యుద్ధం', 'బాలరాజు', 'కీలుగుర్రం', 'లైలామజ్ను' లాంటి సూపర్ సక్సెస్ లతో ఏయన్నార్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. కొన్నిరోజులకి ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరు కలిసి మంచి మిత్రులుయ్యారు. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో హిట్లు కొడుతుంటే.. జానపద చిత్రాలతో ఏయన్నార్ రాణించారు. ఎప్పుడు సినిమాలతో పోటీ పడ్డారే తప్ప వారికేప్పుడు పోటీ లేదు.
ఇద్దరూ కలిసి పల్లెటూరి పిల్ల, సంసారం, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూకైలాస్, గుండమ్మ కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు, సత్యం శివం లాంటి సినిమాలలో నటించారు. ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్రనటులు కూడా ఇన్ని సినిమాల్లో, మళ్ళీ అందులోనూ.. ఇన్ని జానర్స్‌లో కలిసి నటించలేదు. ఇదొక రేర్ రికార్డునే చెప్పాలి.
ఇద్దరి మధ్య ఎవరి ఎన్ని పుల్లలు పెట్టిన వారు మాత్రం కలిసే ఉన్నారు. ఇండస్ట్రీని కలిసే ముందుకు నడిపించారు. వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే... హీరోలు కాకముందు స్టేజీ మీద స్త్రీ పాత్రలు పోషించడం.. అక్కినేని 'హరిశ్చంద్ర'లో చంద్రమతి వేషం వేస్తే... 1940లో కాలేజిలో ఇంటర్ చదివే రోజుల్లో 'రాచమల్లు దౌత్యం' నాటకంలో ఎన్టీఆర్ నాగమ్మ వేషం వేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com