భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ : ఎవరీ జానపద కళాకారుడు?

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్.. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. 'సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు' అంటూ సాగే ఈ జానపద గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాటలో జానపద కళాకారుడు 'దర్శనం మొగులయ్య' ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దర్శనం మొగులయ్య స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు తాలుకా తెల్కపల్లి మండలం గట్టురావిపాకుల గ్రామం. పండుగల సాయన్న, పానుగంటి మియ్యసావు, ఎండబెట్ల ఫకీరయ్య గౌడ్ వంటి వారి వీరగాథలు చెప్పడంలో ఈయన సిద్దహస్తుడు. జానపద కళనే నమ్ముకొని తన గేయాలతో ఆకట్టుకుంటున్నాడు.
ఆయన పవర్ స్టార్ సినిమాలోని టైటిల్ సాంగ్ లో వచ్చే సాకిని అద్భుతంగా పాడి, ఆ పాటకి మరింత వన్నె తెచ్చాడు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాగా సాగర్ కె.చంద్ర దర్శకత్వం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఐశ్వర్యా రాజేశ్, నిత్యామేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com