Pony Verma : ఎవరీ పోనీ వర్మ.. గతంలో ఏం చేసేదంటే..!

మళ్ళీ పెళ్ళంటూ వార్తల్లో నిలిచి టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్.. తన రెండో భార్య పోనీవర్మని మరోసారి పెళ్లి చేసుకున్నారాయన. 11వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన కొడుకు వేదాంత్ కోరిక మేరకు తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నట్టుగా ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనితో ఈ పోనీవర్మ ఎవరు? గతంలో ఆమె ఏం చేసేది? అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
పోనీ వర్మ అసలు పేరు రష్మీ వర్మ.. తెలుగులో ఈమె పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ హిందీ పరిశ్రమకి ఈమె సుపరిచితురాలే. ఆమె ఓ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. గత 21 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. కలర్స్ ఛానెల్లో ప్రసారమైన 'చక్ ధూమ్ ధూమ్' డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరించారు. పలు సినిమాలకి కూడా ఆమె కొరియోగ్రాఫర్‌గా చేశారు.
తెలుగులో 'బద్రీనాథ్, ఆకాశమంత, సూపర్, అలా మొదలైంది' వంటి చిత్రాలకి కొరియోగ్రాఫర్‌గా పనిచేయగా, హిందీలో 'టైగర్ జిందా హై, జంజీర్, జిలా ఘజియాబాద్, డర్టీ పిక్చర్, గుజారిష్, యే తేరా ఘర్ యే మేరా ఘర్, ఎ బర్డ్ ఇన్ డేంజర్, ఫిల్హాల్, ముస్కాన్' వంటి మొదలగు సినిమాలకి కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో ప్రకాష్‌రాజ్‌తో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమకి దారి తీసింది. దీనితో ఇద్దరు కలిసి 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2016లో వేదాంత్ జన్మించాడు.
అయితే పోనీ వర్మ.. ప్రకాష్‌రాజ్‌కి రెండో భార్య.. అంతకుముందు ప్రకాష్‌రాజ్.. లలితకుమారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలున్నారు. 2009లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి పోనీ వర్మను పెళ్లాడాడు ప్రకాష్‌రాజ్.. కాగా ప్రస్తుతం ప్రకాష్‌రాజ్.. తెలుగు, తమిళంలో సినిమాలలో బిజీగా ఉన్నాడు. అంతేగాక టాలీవుడ్‌లో ఈ సారి మా ఎన్నికల అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com