Who is Preetham Jukalker : ఎవరీ ప్రీతమ్ జుకల్కర్.. సమంతకి ఎలా పరిచయం?

Who is Preetham Jukalker : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. భార్యాభర్తలుగా విడిపోతున్నాం.. భవిష్యత్తులో స్నేహితులుగా ఉంటామని అంటూ పేర్కొన్నారు. అయితే ఎందుకు విడిపోయారు అన్నదానిపైన క్లారిటీ ఇవ్వలేదు.. దీనితో అభిమానుల్లో రకరకాల అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పైన నెటిజన్లు మండిపడుతున్నారు.
ఓ ఎనిమిది నెలల క్రితం... ప్రీతమ్ జుకల్కర్ పుట్టినరోజు సందర్భంగా అతడి పైన కాళ్లు పెట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. ఆ ఫోటోకి నాలుగేళ్ళ బంధం అంటూ రాసుకొచ్చింది. ఆ ఫోటోకి ప్రీతమ్ ఐ లవ్ యూ జీజీ(అక్క) అంటూ కామెంట్ పెట్టాడు. ఇది అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. దీనితో సమంతని నెటిజన్లు వీపరితంగా ట్రోల్ చేయడంతో ఆ ఫోటోను వెంటనే డిలిట్ చేసింది సమంత. ఇప్పుడు చైసామ్ విడిపోవడంతో దీనికి కారణం జుకల్కర్ అంటూ నెటిజన్లు అతన్ని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరికి ప్రీతమ్ ఘాటుగానే జవాబు ఇచ్చిన.. ట్రోలింగ్ మాత్రం ఎక్కడ కూడా ఆగడం లేదు. ఈ క్రమంలో ప్రీతమ్.. తన కామెంట్ సెక్షన్‌ని డిసేబుల్ చేసేశాడు.
ఇంతకీ ఎవరీ ప్రీతమ్ జుకల్కర్, సమంతకి ఎలా పరిచయం అంటూ నెటిజన్లు అతని గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ప్రీతమ్ జుకల్కర్ పక్కా హైదరాబాదీ.. 33 ఏళ్లుంటాయి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్‌ని వృతిగా ఎంచుకున్నాడు. ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రావడానికి ప్రీతమ్ తల్లి దీనికి కారణమని చెప్పాలి. చిన్నప్పుడు ప్రీతమ్ వాళ్మ అమ్మ మిషన్ పైన బట్టలు కుట్టేవారు. అక్కడే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళాలని ప్రీతమ్‌కి మొదటగా ఇంట్రెస్ట్ మొదలైంది. ప్రీతమ్ జుకల్కర్ ఫ్యాషన్ మ్యాగ్‌జైన్‌లు చదవడం మొదలుపెట్టాడు. ఫ్యాషన్ అండ్ టెక్స్ టైల్స్‌లో డిగ్రీ చేశాడు.
ఆ తర్వాత భారతీయ వస్త్ర సంప్రదాయాన్ని తెరపైకి తేవాలని దానిని బతికించాలని ఓ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే దానికి తగ్గట్టుగానే డిజైన్స్ చేయడం ప్రారంభించాడు. సమంతకి కూడా చేనేత వస్త్రాల పైన మక్కువ ఎక్కువే.. అందుకే చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓ కార్యక్రమానికి మద్దతు పలికింది. అలా ప్రీతమ్ జుకల్కర్‌కి.. సమంతతో పరిచయం ఏర్పడింది. బయట ఈవెంట్స్‌కి, షోలకి వెళ్ళినప్పుడు ఫ్యాషన్‌గా కనిపించేలా సమంతకి డిజైన్స్ తయారుచేసి ఇచ్చాడు. వీటికి గాను అతనికి మంచి పేరుతో పాటుగా డిమాండ్ కూడా ఏర్పడింది.
ప్రీతమ్ జుకల్కర్ కేవలం సమంతకే కాదు.. రకుల్, రాశిఖన్నాలకి కూడా ఇతనే స్టైలిస్ట్ గా ఉంటున్నాడు. కాటన్ వస్త్రాలకు సంబంధించి ఫ్యాషన్ గార్మెంట్స్ ను తయారుచేయడంలో ప్రీతమ్ కి మంచి పేరుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com