Vishnu Manchu Wife Viranica Reddy : మంచు విష్ణు భార్య ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Vishnu Manchu Wife Viranica Reddy : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎక్కువ మెజారిటీని సొంతం చేసుకుంది. ఆ ప్యానల్ నుంచి ఎక్కువ మంది గెలిచారు. దీనితో సినిమా సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు, క్రీడా ప్రముఖులు ఆయనకీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇండస్ట్రీలో నాగార్జున తరవాత అంత సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా విష్ణుకి మంచి పేరుంది.
ఇదిలావుండగా మంచు విష్ణు.. విరనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విరనికా రెడ్డి ఎవరో కాదు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కి సోదరి అవుతుంది. రాజారెడ్డి కుటుంబంలో ఈమె చిన్నమనవరాలు.. రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతుల కుమార్తె విరనికా.. ఆమె అమెరికాలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి ఆమెకి డాక్టర్ అవ్వాలని ఉండేది. వీరికి ఆఫ్రికాలో చాలా వ్యాపారులున్నాయి. విరనికా రెడ్డి మంచి మనసు చూసి విష్ణు మంచు ప్లాట్ అయిపోయాడు.
వీరిద్దరి ప్రేమకి పెద్దవాళ్ళు కూడా ఓకే చెప్పడంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది ఈ జంట.. కాగా వీరికి నలుగురు పిల్లలున్నారు. విరనికా రెడ్డి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండరు. కానీ గత ఏడాది కరోనా లాక్ డౌన్ టైంలో కర్చీఫ్ ని ఎలా కుట్టులేకుండా మాస్క్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పి అందరిని ఆకట్టుకున్నారు. భర్త చాటు భార్య గానే విరనికా ఉంటూ ఫ్యామిలీతోనే ఎక్కువ సమయాన్ని గడిపేస్తుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com