'అక్కినేని' పేరును సామ్ ఎందుకు తీసేసింది.. సోషల్ మీడియాలో రచ్చ..!

అక్కినేని పేరును సామ్ ఎందుకు తీసేసింది.. సోషల్ మీడియాలో రచ్చ..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌‌‌లలో సమంత ఒకరు. ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతికాలంలోనే టాప్ హీరోలందరి సరనస నటించి టాప్ హీరోయిన్‌‌గా ఎదిగింది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌‌‌లలో సమంత ఒకరు. ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతికాలంలోనే టాప్ హీరోలందరి సరనస నటించి టాప్ హీరోయిన్‌‌గా ఎదిగింది. సినిమాలతో పాటుగా సోషల్‌‌మీడియాలో కుడా చాలా యాక్టివ్ గానే ఉంటుంది సమంత. తన అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ లలో Samantharuthuprabhu అనే తన పూర్తి పేరుతో తొలుత ఖాతాలను ఓపెన్ చేసింది.

ఇక అక్కినేని నటవరాసుడు నాగచైతన్యని పెళ్లి చేసుకున్న అనంతరం Samantha Akkineniగా తన పేరును మార్చుకుంది. ఈ క్రమంలో ఆమెను నెటిజన్లు అభినందించారు కూడా. అయితే తాజాగా తన సోషల్‌మీడియా ఖాతాల్లో సామ్.. తన పేరును మార్చేసుకున్నారు. కేవలం 'S' అని మాత్రమే పెట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకి దారి తీసింది. సమంతకి ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా పేరు మార్చుకుంది అంటూ డిస్కషన్స్ మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా సమంత అభిమానులు మాత్రం.. తన ఇష్టప్రకారం ఆమె పేరు మార్చుకున్నప్పుడు మీకు వచ్చిన సమస్య ఏమిటి? దీనిని కూడా భూతద్దంలో చూసి చర్చ లేవనెత్తాలా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సామ్ 'శాకుంతలం' అనే సినిమాని చేస్తుంది. అందుకే అందులోని మొదటి అక్షరమైన 'S' ని అలా పెట్టుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story