నాగార్జున, బాలకృష్ణ చేయాల్సిన ఆ రెండు సినిమాలు ఎందుకు ఆగిపోయాయి?

నాగార్జున, బాలకృష్ణ చేయాల్సిన ఆ రెండు సినిమాలు ఎందుకు ఆగిపోయాయి?
తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏయ‌న్నార్‌ ఇద్దరూ రెండుకళ్ళు.. ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాదుకి షిఫ్ట్ అవ్వడంలో వీరి పాత్ర అమోఘమని చెప్పాలి.

తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏయ‌న్నార్‌ ఇద్దరూ రెండుకళ్ళు.. ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాదుకి షిఫ్ట్ అవ్వడంలో వీరి పాత్ర అమోఘమని చెప్పాలి. ఇద్దరి మధ్య ఎప్పుడు వృత్తి రిత్యా మాత్రమే పోటీ ఉండేది. ఇద్దరూ కలిసి చాలా సినిమాలలో కలిసి నటించారు కూడా. అయితే ఇందులో ఎవరు బాగా నటించారంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే వారి కంటే వారి పాత్రలే ఎక్కువగా కనిపించేవి అందులో.. ఇది వారి గొప్పతనమే అని చెప్పాలి.

వారి తర్వాత వారి వారసులు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకునేవారు. అందులో భాగంగానే ఎన్టీఆర్, ఏయ‌న్నార్‌ కలిసి నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ గుండమ్మ కథని బాలకృష్ణ, నాగార్జునతో చేయాలనీ అనుకున్నారు పలువురు నిర్మాతలు.. కానీ సూర్యకాంతంలా మెప్పించే నటి దొరకకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత 2011లో వీరిద్దరితో ఓ సినిమా చేయాలనీ అనుకున్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్..

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనీ అనుకున్నారు. ఇద్దరు కూడా ఒకే చెప్పారు. కానీ వేరేవేరే కారణాలతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో హరహర మహాదేవ అనే సినిమాని మొదలుపెట్టారు బెల్లంకొండ సురేష్.. కానీ అనూహ్యంగా ఈ సినిమా కూడా ఆగిపోయింది.

ఇదిలావుండగా అక్కినేని నాగేశ్వరరావుతో బాలకృష్ణ భార్యాభర్తల బంధం, గాండీవం, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలలో కలిసి నటించారు. అటు బాలకృష్ణ సోదరుడు హరికృష్ణతో కలిసి సీతారామరాజు చిత్రంలో నటించారు నాగార్జున.

Tags

Read MoreRead Less
Next Story