ఆన్ స్క్రీన్‌‌లో చైతూ సూపర్బ్.. మరి సమంతతో ఎందుకలా?

ఆన్ స్క్రీన్‌‌లో చైతూ సూపర్బ్.. మరి సమంతతో ఎందుకలా?
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్‌‌స్టొరీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్‌‌స్టొరీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సున్నిత‌మైన అంశాల్ని స్పృశిస్తూనే చక్కని భావోద్వేగాలతో సినిమాని తెరకెక్కించారు శేఖర్.. సినిమా కూడా మంచి హిట్ టాక్‌‌ని సంపాదించుకుంది. మౌనిక, రేవంత్.. ఈ రెండు పాత్రలు సినిమాకి జీవం పోశాయి.

సహజంగా ఏ సినిమాలోనైనా సాయిపల్లవి హీరోయిన్ అంటే పక్కనున్న హీరోలు తెలిపోతుంటారు కానీ ఈ సారి అలా జరగలేదు. సాయిపల్లవికి నటనకి ఎక్కడ కూడా తగ్గకుండా చైతూ కూడా అదరగొట్టాడు. నాగ‌చైత‌న్య ప‌లికించిన భావోద్వేగాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. కెరీర్‌‌లోనే ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటూ ప్రేక్షకులు కూడా చైతూని పొగిడేస్తున్నారు.

మొదటి సినిమా జోష్ నుంచి తనని తానూ కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు చైతూ... సినిమా సినిమాకి నటుడిగా ఎంతో పరిణితి చెందుతున్నాడు. అయితే ఇందులో ఎక్కువగా లవ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్ వచ్చిన మూవీస్ ప్రేక్షులను బాగా ఆకట్టుకున్నాయి.

ఏ మాయ చేశావే, 100% లవ్, మజిలి, ప్రేమమ్ లాంటి సినిమాలలో చూస్తే మనకి ఈజీగా అర్ధం అయిపోతుంది. ఇందులో చైతూ నటనకి ఎక్కడ కూడా వంక పెట్టలేము... ఇలాంటి సీన్స్ లలో చైతూ నటించాడు అనడం కన్నా జీవించాడని చెప్పేయొచ్చు. తాజాగా వచ్చిన లవ్‌స్టొరీ లోనూ పెర్ఫార్మన్స్ పరంగా సూపర్బ్ అనిపించుకున్నాడు.

అన్ స్క్రీన్‌‌లో ది బెస్ట్ అనిపించుకుంటున్న ముందుకు వెళ్తున్న చైతన్య .. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం బ్యాలెన్స్ తప్పుతున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. రీల్ లైఫ్‌‌లో పలుమార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న సమంతతోనే రియల్ లైఫ్ ని కూడా షేర్ చేసుకున్నాడు చైతన్య.

టాలీవుడ్‌‌లో ది బెస్ట్ జోడి అనిపించుకున్న ఈ జంట త్వరలో విడిపోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ వార్తల పైన అటు చైతూ, ఇటు సామ్ స్పందించకపోవడంతో బ్రేకప్ అనే ఊహాగానాలకి ఇంక ఆజ్యం పోసినట్టు అవుతుంది. మరి వీరిద్దరూ ఈ వార్తలకి బ్రేకప్ చెబుతారా లేదా రిలేషన్‌‌కే బ్రేకప్ చెబుతారా అన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story