Samantha : సమంత తిరుమల సెంటిమెంట్.. చైతూ కోసమేనా?

Samantha : సమంత తిరుమల సెంటిమెంట్.. చైతూ కోసమేనా?
సమంత.. గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తుంది ఈ అక్కినేని వారికోడలు. చైతూ, సామ్ ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని, త్వరలోనే ఇద్దరూ విడిపోతారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

సమంత.. గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తుంది ఈ అక్కినేని వారికోడలు. చైతూ, సామ్ ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని, త్వరలోనే ఇద్దరూ విడిపోతారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలావుండగా ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సమంత.. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు ఆమె. దర్శనానంతరం ఆమెకి స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు.

అనంతరం బయటకు వచ్చిన సమంతని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అటు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పై ఓ విలేఖరి ఆమెను ప్రశ్నించగా సమంత అసహనం వ్యక్తం చేశారు. నేను వచ్చింది ఆలయానికి.. అదేం ప్రశ్న బుద్ధుందా.. ! అంటూ ఫైర్ అయ్యారు సమంత.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా సమంత ఇప్పుడు తిరుమలకి ఎందుకు వెళ్ళిందన్న చర్చ నడుస్తోంది. తన సినిమాలు కానీ తన భర్త చైతూ సినిమాలు కానీ రిలీజ్ అయ్యే ముందు సమంత తిరుమలని దర్శిచుకుంటుంది. గతంలో మజిలి చిత్రం రిలీజ్ అయ్యే మూడు రోజుల ముందు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే సమంత ప్రధానపాత్రలో వచ్చిన ఓ బేబీ సినిమా రిలీజ్‌‌కి నాలుగు రోజుల ముందు ఆమె శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

ఇప్పుడు ఈ నెల 24న నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టొరీ సినిమా రిలీజ్‌‌కి సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఆమె సినిమా సక్సెస్ కోసమే తిరుమలకి వెళ్లి ఉండొచ్చని అభిమానులు అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story