18 Sep 2021 1:30 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Samantha : సామ్ అలా...

Samantha : సామ్ అలా ఎందుకు చేసింది?

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అందునా అక్కినేని వారింటి కోడలు.. ప్రస్తుతం ఆ ఇంటి నుంచి ఏ వార్త వచ్చినా అదో పెద్ద సెన్సేషన్.

Samantha : సామ్ అలా ఎందుకు చేసింది?
X

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అందునా అక్కినేని వారింటి కోడలు.. ప్రస్తుతం ఆ ఇంటి నుంచి ఏ వార్త వచ్చినా అదో పెద్ద సెన్సేషన్. ఈ మధ్య సోషల్ మీడియాలో సమంత, చైతన్యల ఇష్యూ హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే.. ఇద్దరూ విడిపోతరంటూ న్యూస్ తెగ స్ప్రెడ్ అవుతోంది.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది కూడా. అయితే ఈ వార్తలను వాళ్లిద్దరూ ఎక్కడా దీనిని ఖండించలేదు. అలాగని సమర్థించనూ లేదు. ఇద్దరూ పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటప్పుడు వారి లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది.

ఈ క్రమంలోనే సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన సమంతను ఓ విలేకరి అదే విషయంపై ఆమెను ప్రశ్నించాడు. దాంతో సామ్ ఒక్కసారిగా అతడిపైన ఫైర్ అయింది. సహజంగా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సమంత అలా.. ఒక్కసారిగా సీరియస్ అవడంతో ఇష్యూ అనేది మరింత హాట్ టాపిక్ అయింది. సాధారణంగా సెలబ్రెటీలకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు తారసపడుతుంటాయి. ఇది ఇండస్ట్రీలో కామనే కూడా.. అయితే వాటికి స్పందిస్తూనే చాలా కూల్‌గా ఎస్కేప్ అవుతుంటారు వారు.

కానీ ఈ విషయంలో సమంత అందుకు విరుద్దంగా ప్రవర్తించినట్టుగా కనిపించింది. సామ్ అలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం.. ఇద్దరి మధ్య విబేధాలున్నాయన్న చర్చలకి మరింత స్కోప్ ఇచ్చినట్టు అయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకి రియాక్ట్ అవుతూ ముందుకు వెళ్తే ఇష్యూ ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉందన్న కోణంలో సమంత దానిపైన రియాక్ట్ అవ్వలేదన్న సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి.

Next Story