'వైల్డ్ డాగ్'.. సమంత కామెంట్.. ట్విట్టర్ రివ్యూ..

వైల్డ్ డాగ్.. సమంత కామెంట్.. ట్విట్టర్ రివ్యూ..
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటించగా, ఆయన సరసన దియా మిర్జా నటించారు.

సీనియర్ హీరో నాగార్జున హీరోగా యాక్షన్ మూవీ కథాంశంతో వైల్డ్ డాగ్‌ను రూపొందించారు దర్శకుడు అహిషోర్ సాల్మోన్. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటించగా, ఆయన సరసన దియా మిర్జా నటించారు. సయామీ ఖేర్ మరో కీలక పాత్ర పోషించారు.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజైన ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకునేలా చేసింది. నాగార్జున లుక్‌తో పాటు, యాక్షన్స్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చూపించడంతో చిత్రం రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూశారు.

కాగా, విడుదలకు ఒకరోజు ముందే సినిమా చూసిన నాగార్జున కోడలు సమంత, చిత్రంపై ప్రశంల వర్షం కురిపించింది. హాలీవుడ్ స్టైల్ నెరేషన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయని సమంత ట్వీట్ చేశారు. ఇక మూవీ ప్రీమియర్ చూసిన ఆడియన్స్ కూడా చిత్రంపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఏసీపీ వర్మగా నాగార్జున నటన సూపర్‌గా ఉందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story