Y Vijaya: 'విజయశాంతి అలా అనుండకపోతే నేను ఎలా ఉండేదాన్నో!'

Y Vijaya: ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీనియర్ నటీనటులు మళ్లీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వారంతా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఉన్నారు. అందులో ఒకరు వై విజయ. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించిన వై విజయ.. మళ్లీ చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలో మళ్లీ బిజీ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ.
తనకు విజయశాంతి చెప్పిన మాటల ఈరోజు తాను సంతోషంగా జీవిస్తున్నానని అన్నారు విజయ. ఒకప్పుడు సౌత్‌లో వరుసగా సినిమాలు చేసే సమయంలో ఆర్థికంగా బాగుండేవాళ్లమని తెలిపారు. అదే సమయంలో హీరోయిన్‌గా రాణిస్తున్న సావిత్రమ్మ జీవితం చూసిన తర్వాత సినిమా అనేది జీవితాంతం ఉండదని అర్థమైందని అన్నారు. అందుకే తనకంటూ ఓ ఆదాయం ఉండాలని పెట్టుబడులు పెట్టామని తెలిపారు.
ఆర్థికంగా తాను ఈ స్థాయిలో ఉండడానికి విజయశాంతి కూడా ఓ కారణమని తెలిపారు. షూటింగ్ సమయాల్లో ఎప్పుడూ ఖాళీ ఉన్నా.. సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లమని అన్నారు. అలాంటి ఒక సమయంలో పెట్టుబడుల గురించి ప్రస్తావన వచ్చిందని, దాంతో తాను కూడా పెట్టుబడులు పెడుతూ ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నామని చెప్పారు విజయ. ఇక 1961 నుండి ఇండస్ట్రీలో ఉన్న విజయ.. దాదాపు వెయ్యికు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com